రాజమౌళి సినిమాలో లేడీ విలన్.. వినటానికి కొత్తగా ఉందికదూ.. కానీ ఫిలింవర్గాలు నిజమే అంటున్నాయి. త్వరలో మహేశ్‌బాబుతో ఆయన రూపొందించనున్న సినిమాలో పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్ కానుందట. మొదట ఐశ్వర్యరాయ్‌ని ఈ పాత్ర కోసం అడిగారట రాజమౌళి. అయితే.. ఏమైందోఏమో చివరకు కాజల్ అగర్వాల్ ఖరారైనట్టు తెలుస్తున్నది.
రాజమౌళి ‘మగధీర’లో మిత్రవిందగా యువతరాన్ని ఉర్రూతలూగించింది కాజల్. మళ్లీ ఇప్పుడు అదే రాజమౌళి దర్శకత్వంలో నెగెటివ్ పాత్ర చేయనుండటం నిజంగా ఆసక్తికరమైన విషయమే. ఈ చిత్రాన్ని రచయిత విజయేంద్రప్రసాద్ రెండు భాగాలుగా రాయాలనుకున్నారట. అయితే దర్శకుడు రాజమౌళి అభిప్రాయం ఏంటో తెలియాల్సివుంది.