సాయిపల్లవి, రణబీర్‌కపూర్ సీతారాములుగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పానిండియా పౌరాణిక ఇతిహాసం ‘రామాయణ’లో రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాను పోషిస్తున్న మండోదరి పాత్ర గురించి తాజా ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ- ‘ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్నది. మేం ఇప్పటివరకూ తొలి భాగానికి చెందిన షూట్‌ని మాత్రమే పూర్తి చేశాం.
ఫస్ట్ పార్ట్‌లో రావణ లంక సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, నా పాత్ర నిడివి కూడా తక్కువే ఉంటుంది. సెకండ్ పార్ట్‌లో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా యశ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభవం. రావణ పాత్ర కోసం యశ్ చాలా శ్రమిస్తున్నారు. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోయా’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.