Maa Elections | మా ఎన్నికల్లో మరో నటుడు..300 ఓట్లు ఖాయమట..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (Maa Elections) గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. రోజుకొకరు తాము కూడా పోటీలో ఉన్నామంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (Maa Elections) గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. రోజుకొకరు తాము కూడా పోటీలో ఉన్నామంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా మరో సీనియర్ నటుడు కూడా ఎన్నికల్లో దిగబోతున్నాడు. ఆయనెవరో కాదు కాదంబరి కిరణ్ (Kadambari Kiran). ఈయన చాలా కాలంగా ‘మా ‘ లో సభ్యుడిగా ఉన్నాడు. శివాజీ రాజా ప్యానల్ లో కూడా పని చేసాడు. ‘మా ‘ అసోసియేషన్ బాగా పాడైపోయిందని.. కేవలం పదవుల కోసమే చూసుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారంటూ ఈ మధ్యే కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఈయన కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు గెలిచి చూపిస్తానని ధీమాగా చెప్తున్నాడు. ఇప్పటికే ఐదుగురు సెలబ్రిటీలు అధ్యక్ష బరిలో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీలో ఉన్నానంటూ కిరణ్ అనౌన్స్ చేసాడు. తనకు సినిమాల నుంచి వచ్చే డబ్బులు తప్ప వేరే ఆదాయం లేదని స్పష్టం చేసాడు కాదంబరి కిరణ్. ఇండస్ట్రీతోపాటు బయట కూడా తనను చాలా మంది కోటీశ్వరుడు అనుకుంటున్నారని..అలాంటిదేం లేదని చెప్తున్నాడు కాదంబరి కిరణ్.
మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా (Shivaji Raja) తాను బావా బావమరుదులమని.. తమ మధ్య గ్యాప్ ఉంటే మంచిదని కాదంబరి కిరణ్ తెలిపాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తానని కాదంబరి కిరణ్ సవాల్ చేసాడు. అంతేకాదు.. ‘మా ‘లో 900 మంది సభ్యులున్నా కూడా..ఎన్నికలు జరిగినపుడు ఓటు వేయడానికి కేవలం 415 మంది మాత్రమే వస్తారని చెప్పాడు. అందులో 300కు పైగా ఓట్లు తనకే పడతాయని కాదంబరి కిరణ్ ధీమాగా చెప్తున్నాడు.
ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాను చెప్పడం లేదని.. ఎన్నిక జరిగిన తర్వాత ఆ విషయం మీరే ఒప్పుకుంటారని సవాల్ చేస్తున్నాడు కాదంబరి కిరణ్. మా అధ్యక్ష పదవికి గెలవడం కష్టం కాదని.. అనవసరంగా దాన్ని పెద్దది చేసి చూపిస్తున్నట్లు చెప్పాడు కాదంబరి కిరణ్. ఎన్ని ఓట్లు పోల్ అయినా తనకు 300 ఓట్లు గ్యారంటీ అని కాదంబరి కిరణ్ కామెంట్ చేసాడు. ఈయన వ్యాఖ్యలు ‘మా’లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

