Jailer first single | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జైలర్ (Jailer). టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna bhatia) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ మూవీ నుంచి కావాలా (Kaavaalaa) సాంగ్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా తెలుగు వెర్షన్ కావాలి (kaavaali) సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. శ్రీ సాయి కిరణ్ రాసిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ రవిచందర్ పాడారు.
ఇప్పటికే తమిళ్ వెర్షన్ నువ్ కావాలయ్య నెటిజన్లను ఇంప్రెస్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ సాంగ్‌కు నెట్టింట వేల సంఖ్యలో రీల్స్ దర్శనమిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. తెలుగు వెర్షన్ తమిళ సాంగ్‌ను మంచి వ్యూస్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. తాజా సాంగ్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది.
జైలర్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునీల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన మోహన్ లాల్, సునీల్, తమన్నా స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
కావాలి లిరికల్ వీడియో సాంగ్..
కావాలా లిరికల్ వీడియో సాంగ్..
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023