రాజశేఖర్‌వర్మ, పూజ కిరణ్ జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘కాళంకి భైరవుడు’. హరిహరన్.వి దర్శకుడు. కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. రాజశేఖర్, జీవిత ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేసి చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందజేశారు. హీరో ముఖంపై చిందిన రక్తం.. నిప్పు కణికల్లాంటి కళ్లు.. హీరో పాత్రలోని ఉద్వేగాన్ని, ఉద్రేకాన్నీ తెలియజేస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆమని, రితిక చక్రవర్తి, నాగ మహేశ్, బలగం జయరాం, భవ్య, మహ్మద్ భాషా, బిల్లి మురళి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అశోక్ అన్నెబోయిన, సంగీతం: పెద్దపల్లి రోహిత్.