Family Star | ఫ్యామిలీ స్టార్ ప్రొమోషన్స్.. కల్యాణి వచ్చా వచ్చా పాటకు డ్యాన్స్ ఇరగదీసిన విజయ్ – మృణాల్
Family Star | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఏప్రిల్ 5న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Family Star | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఏప్రిల్ 5న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రొమోషన్స్ను షురూ చేసింది. ప్రొమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ – మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘కల్యాణి వచ్చా వచ్చా.. ’ (Kalyani Vaccha Vacchaa)కి అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా సాంగ్‌కు డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
‘కల్యాణి వచ్చా వచ్చా..పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా.. ఏనుగంబారీ సిద్ధంగుంచా..’ అంటూ పెళ్లి సందడికి అద్దం పడుతూ సాగే ఈ పాటను ఇటీవలే చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ పాటను అనంత శ్రీరామ్ రచించగా.. మంగ్లీ, కార్తీక్ ఆలపించారు. గోపీసుందర్ స్వరాలను అందించారు. ఈ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
Also Read..
Gaami | విశ్వక్సేన్ గామిని థియేటర్లో మిస్సయ్యారా..?
Pushpa The Rule | పుష్ప ది రూల్ ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ ఏంటో మరి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

