హైదరాబాద్: గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గానకోకిల పాడిన పాటల్లో నటించడం తన అదృష్టం సీనియర్ నటి, ఎంపీ హేమా మాలిని అన్నారు. సంగీతం ఉన్నంత వరకూ ఆ గాన మాధుర్యం ఎన్నటికీ నిలిచే ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
గాన కోకిల లతా మంగేష్కర్ మృతిపట్ల బాలీవుడ్ నటి హేమామాలిని సంతాపం తెలిపారు. లత పాడిన పాటల్లో నటించడం తన అదృష్టం అని అన్నారు. లతా చాలా ప్రత్యేకం.. ఆమెలా ఎవరూ పాడలేరుని చెప్పారు.
లెజెండరీ సింగర్ లతా మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘భారత సినీ గానకోకిల, ది గ్రేటెస్ట్ లెజెండ్ లతా మంగేష్కర్ ఇక లేరు. నిజంగా ఇది గుండెబద్దలయ్యే వార్త. ఆవిడ లేని లోటు తీర్చలేనిది. ఆమె అసాధారణమైన జీవితం గడిపారు. ఆవిడ గానం సజీవం. సంగీతం ఉన్నంత వరకూ ఆ గాన మాధుర్యం ఎన్నటికీ నిలిచే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Nightingale of India, one of the greatest Legends #Lata Didi is no more.Heartbroken💔 The vacuum due to this colossal loss can never be filled. She lived an extraordinary life.Her Music lives on & will continue to cast a spell until Music is there! Rest in Peace #LataMangeshkar
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 6, 2022
లతా మంగేష్కర్ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ఆమె మృతి దేశానికి తీరనిలోటన్నారు. మధురగాత్ర మహారాణి లతా మంగేష్కర్ అన్నారు. కొత్త తరం గాయకులకు లత స్ఫూర్తిప్రదాత అని చెప్పారు.
Deeply saddened by the passing of Lata Ji. A truly irreparable loss for the nation indeed. The Queen of Melody will continue to reign in our hearts and minds and inspire a generation of singers.
— Jr NTR (@tarak9999) February 6, 2022
తరాల తరబడి లత గాత్రం ప్రపంచాన్ని ఏలిందని సూపర్‌స్టార్ మహేశ్ బాబు అన్నారు. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరని తెలిపారు. లత మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
Deeply saddened by Lata Mangeshkar ji's demise. A voice that defined Indian music for generations… Her legacy is truly unparalleled. Heartfelt condolences to the family, loved ones and all her admirers. Rest in peace Lata ji. There will never be another. 🙏🙏🙏
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2022