ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో ఎన్టీఆర్ రౌద్రరసపూరితంగా కనిపిస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా బరిలో ఈ సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తీర ప్రాంత నేపథ్య కథాంశంతో భారీ యాక్షన్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎర్ర సముద్రం నేపథ్యంలో విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్, రచనా-దర్శకత్వం: కొరటాల శివ.