టాలీవుడ్లో పలు బ్రాండ్లను ప్రమోట్ చేసే హీరోలున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోలకున్న ఇమేజ్, క్రేజ్, స్టార్‌డమ్‌ను తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు పలు బ్రాండ్ల కంపెనీలు ఉపయోగించుకుంటాయని తెలిసిందే. ఈ టాపిక్ ఎందుకొచ్చిదంటే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తాజాగా మరో బ్రాండ్‌కు ప్రచారం చేయబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
తాజా అప్డేట్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ఓ ప్రముఖ కంపెనీతో భారీ మొత్తానికి బ్రాండ్ ఎండార్స్ మెంట్ (Ad endorsement)కు సంతకం చేసినట్టు వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ ఒకే చేసిన టీవీ అండ్ డిజిటల్ కమర్షియల్ యాడ్ షూటింగ్ రామోజీఫిలింసిటీలో కొనసాగుతుండగా.. తారక్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది.
తారక్ ఇప్పటికే Fantaకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. కొత్త కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నట్టు ఇన్సైడ్ టాక్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 కోసం రెడీ అవుతున్నాడు. త్వరలో కొరటాల అండ్ టీం ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.