ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారు. షూటింగ్ ప్రారంభించకముందే మూవీ రిలీజ్ డేట్ను కూడా ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రంలో నాయికను ప్రకటించాల్సి ఉంది. ఆదివారం ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లో రెండు చేతుల్లో ఆయుధాలతో ఉన్న ఎన్టీఆర్ స్టిల్ ఉంది. ఇందులో ధైర్యానికి ప్రతీకలా కథానాయకుడి క్యారెక్టర్ ఉండ నుంది. ఈ పోస్టర్ చూస్తే ఈ సినిమా మాస్, యాక్షన్ కథా నేపథ్యంతో తెరకెక్కనున్నట్లు తెలుస్తున్నది. వెన్ కరేజ్ టర్న్స్ ఇంటూ ఏ డిసీజ్, ఫియర్ ఈజ్ ద ఓన్లీ క్యూర్ (ధైర్యం రుగ్మతగా మారితే భయమొక్కటే చికిత్స) అనే క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.