Jawan Movie | జవాన్ వీర విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆహా ఓహో అనిపించే రేంజ్లో రావట్లేదు కానీ.. వీక్ డేస్‌లో డీసెంట్ కలెక్షన్లే రాబడుతుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.695 కోట్లు కొల్లగొట్టింది. ఈ వారం నార్త్‌లో చెప్పుకోదగ్గ రేంజ్లో సినిమాలేవి రిలీజ్ కాకపోవడం బాగా కలిసొచ్చింది. ఇదే జోరు కొనసాగితే వచ్చే వారంలోపు వెయ్యి కోట్ల మార్క్ అందుకునే చాన్స్ ఉంది. అదే జరిగితే తొలిసారి రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్న తొలి ఇండియన్ హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించిన వాడవుతాడు. ఇక ఎప్పుడూ లేనిది సౌత్ ఇండియాలో కూడా షారుఖ్ సినిమాకు రీజినల్ భాషల్లో కోట్లు కోట్లు కలెక్షన్లు వస్తున్నాయి. ఇక సినిమా చూసిన ఆడియెన్స్ షారుఖ్ యాక్షన్, అట్లీ డైరెక్షన్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
ఇక చాలా మంది నార్త్ ప్రేక్షకులు జవాన్‌కు అనిరుధ్ అందించిన సంగీతం గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిందని అంటున్నారు. మీర ముఖ్యంగా ఛలేయా పాటను థియేటర్లో చూసిన తర్వాత చాలా మందికి హాట్ ఫేవరైట్ అయ్యింది. ఈ పాటను హిందీలో అర్జిత్ సింగ్ ఆలపించాడు. ఇక తాజాగా ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అనిరుధ్ స్పెషల్ వీడియోను పంచుకున్నాడు. ఇదిగో మీ చలేయా అంటూ స్వయంగా పాటను ఆలపించాడు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా షారుఖ్‌కు ఇచ్చిన ఎలివేషన్లకు నార్త్ ఆడియెన్స్ ఊగిపోతున్నారు. పలువురు బాలీవుడ్ దర్శకుల పేర్లు ప్రస్తావిస్తూ సినిమాలంటే ఇలా తీయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. దీపికా గెస్ట్ అప్పియెరెన్స్ కనిపించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చాడు.
It’s been a while.. here’s your fav #Chaleya ❤️@iamsrk @atlee @RedChilliesEnt @TSeries pic.twitter.com/TAzaqYgZsC
— Anirudh Ravichander (@anirudhofficial) September 14, 2023