Sundeep Kishan | కోలీవుడ్ ‘దళపతి’ విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘సిగ్మా’ (SIGMA) అప్పుడే గుమ్మడికాయ కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పనులు విజయవంతంగా పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక వీడియోను కూడా పంచుకుంది. మరోవైపు ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కోసం విజయ్ అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్కోర్ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచిన చిత్ర బృందం, త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.
సాధారణంగా స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటాం, కానీ జేసన్ సంజయ్ తన అభిరుచికి తగ్గట్టుగా దర్శకత్వాన్ని ఎంచుకున్నారు. లండన్ మరియు కెనడాలలో ఫిల్మ్ మేకింగ్‌పై ప్రత్యేక శిక్షణ పొందిన సంజయ్, ఒక పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌తో మెగా ఫోన్ పట్టారు. సందీప్ కిషన్ కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో ఆయన ఇమేజ్ను పెంచే చిత్రమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.