Jani Master | 37 రోజుల్లో ఎంతో కోల్పోయాను.. భావోద్వేగంతో జానీ మాస్టర్ పోస్టు
Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 37 రోజుల్లో ఎంతో కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలు నన్ను ఇక్కడకు తీసుకొచ్చాయని జానీ మాస్టర్ పేర్కొన్నారు.
లేడి డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 20న అరెస్ట్ అయ్యాడు జానీ మాస్టర్. గత 36 రోజులుగా జైలు జీవితం గడిపిన జానీకి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం విడుదల అయ్యారు. 2017లో ఓ టీవీ షోలో పాల్గోన్న ఒక మహిళ కొరియోగ్రాఫర్‌తో జానీ మాస్టర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే జానీ తన టీంలో తీసుకున్నాడని.. నేను మైనర్‌గా ఉన్న సమయంలోనే ఒక హోటల్లో జానీ తనపై హత్యాచారానికి పాల్పడ్డాడు అని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376, 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రోడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు. రీసెంట్గా జాతీయ అవార్డుల నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు బెయిల్ కావాలని కోర్టును కోరగా.. బెయిల్ మంజూరు చేసింది. అయితే అవార్డును క్యాన్సిల్ చేసింది జాతీయ అవార్డుల కమిటీ. అనంతరం బెయిల్ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు జానీ. అయితే రెగ్యూలర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది.
A lot is taken away from us in these 37 days 🥹
My family & well wishers’ prayers got me here today. Truth is often eclipsed but never extinguished, it will prevail one day. This phase of life which my entire family had gone through, will pierce my heart forever 🙏🏻 pic.twitter.com/kJFgi4zad2— Jani Master (@AlwaysJani) October 26, 2024
ఇవి కూడా చదవండి..
Vijay Devarakonda | ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ
Renu Desai | ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది : రేణూ దేశాయ్
Biggboss Telugu | డేంజర్ జోన్లో మెహబుబ్, నయన్.. ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవరంటే.?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

