Biggboss Telugu | డేంజర్ జోన్లో మెహబుబ్, నయన్.. ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవరంటే.?
Biggboss Telugu | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఎనిమిదో వారం చివరిరోజుకు చేరుకుంది.
Biggboss Telugu | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఎనిమిదో వారం చివరిరోజుకు చేరుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, కిరాక్ సీత ఎలిమినేట్ అవ్వగా.. గత వారం నాగమణికంఠ హౌజ్ నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఈ వారం హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై బిగ్ బాస్ లవర్స్‌తో పాటు ప్రేక్షకులకు ఆసక్తి మొదలైంది.
ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఉన్నారు అనేది చూసుకుంటే.. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావనిలు నామినేషన్లో ఉన్నారు. ఇందులో ఈ వారం అత్యధిక ఓటింగ్ నిఖిల్‌కు ఉండడంతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ప్రేరణ రెండో స్థానంలో కొనసాగుతోంది. కొత్త మెగా చీఫ్ విష్ణు ప్రియ మూడు, పృథ్వీ నాలుగో స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఇక తక్కువ ఓటింగ్‌తో డేంజర్ జోన్లో మెహబుబ్‌తో పాటు నయన్ పావనిలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారు అనేది రేపు తెలియనుంది. మరోవైపు గతవారం ఎపిసోడ్లో నాగ మణికంఠను ఎలిమినేట్ చేస్తూ.. వచ్చే వారం ఊహించని ట్విస్ట్ ఉంటుందని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ఏంటి అంటే గతవారం ఎలిమినేట్ అయిన నాగ మణికంఠ మళ్లీ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై రేపటి ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది. మరోవైపు శనివారం ఆదివారం ఎపిసోడ్లలో నటుడు కిరణ్ అబ్బవరంతో పాటు తమిళ నటులు శివ కార్తికేయన్, సూర్య సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

