Janhvi Kapoor | అంబానీ కోడలికి జాన్వీ కపూర్ స్పెషల్ పార్టీ.. ఫొటోలు వైరల్
Janhvi Kapoor | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్పెషల్ పార్టీ ఇచ్చింది. జాన్వీ తన స్నేహితులతో కలిసి రాధికకు బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేసింది (Bridal Shower).
Janhvi Kapoor | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం ఈ ఏడాది జులైలో జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో (Radhika Merchant) అనంత్ పెళ్లి జరగబోతోంది. గత నెల మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరిగాయి. గుజరాత్ జామ్ నగర్లో మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతోపాటు క్రీడా, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు.
కాగా, తాజాగా అంబానీ ఇంటికి కాబోయే కోడలికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్పెషల్ పార్టీ ఇచ్చింది. జాన్వీ తన స్నేహితులతో కలిసి రాధికకు బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేసింది (Bridal Shower). ఈ వేడుకలో కాబోయే కొత్త జంటతోపాటు అంబానీ కూతురు ఇషా అంబానీ, పెద్ద కోడలు శ్లోకా మెహతా, రాధికా సోదరి అంజలీ మర్చంట్, జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా సహా తదితరులు హాజరై సందడి చేశారు. ఇక ఈ పార్టీలో కాబోయే కొత్త పెళ్లి కూతురు వైట్ డ్రెస్‌లో ప్రిన్సెస్‌లా మెరిసిపోయింది. మిగతావారంతా పింక్ కలర్ అట్టైర్స్తో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఫన్నీ గేమ్స్, డ్యాన్సులతో అంతా ఒకచోట చేరి బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ కపూర్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ‘మా స్పెషల్ పెళ్లి కుమార్తె కోసం.. ఎ ప్రిన్సెస్ డైరీస్ రాయల్ పార్టీ’ అంటూ జాన్వీ ఈ పోస్టుకి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.
Also Read..
Ranveer Singh | వారణాసిలో కృతిసనన్, రన్వీర్ సింగ్ సందడి.. ట్రెండింగ్‌లో విజువల్స్
Aishwarya Shankar | శంకర్ కూతురు ఐశ్వర్య-తరుణ్ కార్తీక్ వెడ్డింగ్.. ట్రెండింగ్‌లో ఫొటోలు
Pottel Movie | గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ‘పొట్టేల్’.. టీజర్ టైం ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

