ముంబై: జాన్వీ కపూర్ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తోంది. లొకేషన్ ఎక్కడో తెలియదు, కానీ బాలీవుడ్ నటి పచ్చని చెట్ల మధ్య ఫుల్ కుషీగా గడుపుతోంది. శనివారం మధ్యాహ్నం జాన్వీ తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలు పోస్టు చేసింది. ఎంతో హ్యాపీగా కనిపిస్తున్న జాన్వీ.. ఆ ఫోటోలో ఉన్న లొకేషన్‌ను మాత్రం చెప్పలేదు. వైట్ కలర్ క్రాప్ టాప్, నియాన్ గ్రీన్ కలర్ స్కర్ట్‌లో ఆమె జింక పిల్లలా గెంతులేస్తూ వీకెండ్ మూడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కెమెరాకు ఫోజులిచ్చిన ఆ బ్యూటీ.. స్మైలింగ్ ఫేస్‌తో తన ఫాలోవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. మరో ఫోటోలో ఆమె తన లొకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉంది. తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన ఫోటోలను కూడా పోస్టు చేసిన విషయం తెలిసిందే. రూహి ఫిల్మ్ తర్వాత జాన్వీకి కొత్త చిత్రాలేవీ లేవు.