Janhvi Kapoor | ఆ విషయంలో ఎవరూ నాతో పోటీ పడలేరు.. తన టాలెంట్ బయటపెట్టిన జాన్వీ కపూర్
Janhvi Kapoor |చరిత్ర అధ్యయనాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని, కాలేజీ రోజుల్లో హిస్టరీ తన ఫేవరేట్ సబ్జెక్ట్ అని చెప్పింది అందాల భామ జాన్వీకపూర్. ఆమె తాజా చిత్రం ‘బవాల్' శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. చరిత్ర, వర్తమాన అంశాలను కలబోసి దర్శకుడు నితీష్ తివారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Janhvi Kapoor | చరిత్ర అధ్యయనాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని, కాలేజీ రోజుల్లో హిస్టరీ తన ఫేవరేట్ సబ్జెక్ట్ అని చెప్పింది అందాల భామ జాన్వీకపూర్. ఆమె తాజా చిత్రం ‘బవాల్’ శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. చరిత్ర, వర్తమాన అంశాలను కలబోసి దర్శకుడు నితీష్ తివారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నటిగా ఈ సినిమా తనను ఓ మెట్టు ఎక్కించిందని జాన్వీకపూర్ ఆనందం వ్యక్తం చేసింది. చరిత్ర ప్రస్తావన ఉన్న సినిమాల్లో నటించడం గొప్ప అనుభవమని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘పాఠాశాల రోజుల నుంచే హిస్టరీ అంటే చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన వ్యాస రచన పోటీల్లో నాకు బహుమతులు లభించేవి.
మిగతా సబ్జెక్ట్స్‌లో నేను సాధారణ స్టూడెంట్‌నే కానీ హిస్టరీలో మాత్రం నాతో ఎవరూ పోటీపడలేక పోయేవారు. ప్రపంచ చరిత్రపై నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ‘బవాల్’ చిత్రంలో రెండో ప్రపంచ యుద్ధ ప్రస్తావన ఉంటుంది. ఈ సినిమా కోసం ‘ఏ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకాన్ని చదివాను. నాజీల కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో యూదులు అనుభవించిన కష్టాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నా. ‘బవాల్’ సినిమా విషయంలో ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది. భవిష్యత్తులో చారిత్రక కథాంశాల్లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నది.
Read More :
Janhvi Kapoor | చమ్కీల డ్రెస్‌లో జిగేలు రాణిలా జాన్వీకపూర్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

