హైదరాబాద్: జాన్వీ కపూర్(Janhvi Kapoor), వరుణ్ ధావన్ ఫోటోషూట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ జంట తాజాగా చేసిన ఫోటోషూట్‌పై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అభిమానులు మాత్రం ఆ ఇద్దర్నీ ఆశీర్వదిస్తున్నారు. జాన్వీ, వరుణ్ నటించిన బవాల్ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్నది. ఆ లవ్ స్టోరీ రిలీజ్ కావడానికి ముందే.. ఆ ఇద్దరూ ఓ ఫోటో షూట్ చేశారు. ఫిల్మ్ ప్రమోషన్లో భాగంగా చేపట్టిన ఆ ఫోటోషూట్ ఇప్పుడు ఆ ఇద్దరు స్టార్స్‌ను ఇరకాటంలో పడేసింది.
ఆ ఫోటోషూట్‌కు చెందిన ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. చాలా ఇంటిమేట్‌గా ఉన్న ఆ ఫోటోలు కొందరు ఫిల్మ్ లవర్స్‌ను ఇబ్బందిపెట్టాయి. వరుణ్ ధావన్ తొడపై కూర్చున్నట్లుగా ఓ ఫోటో.. ఇక అతన్ని హగ్ చేస్తున్న మరో ఫోటోను జాన్వీ పోస్టు చేసింది. బ్లాక్ డ్రెస్సులో జాన్వీ.. వైట్ అండ్ లెదర్ జాకెట్లో వరుణ్ ఉన్న ఆ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వరుస ఫోటోలపై కొందరు ఎమోజీలతో పంచ్‌లు కూడా విసురుతున్నారు.
నిజానికి జాన్వీ పోస్టు చేసిన ఫోటోలపై చాలా వరకు అభిమానులు ఆగ్రహంగానే ఉన్నారు. జాన్వీ ఆంటీ మహేప్ కపూర్ తన కామెంట్ సెక్షన్లో హార్ట్ ఐ ఎమోజీని పోస్టు చేసింది. దానికి లవ్ అని కూడా రాసిందామె. ఇక కొందరైతే ఇలాంటి ఫోటోషూట్ అవసరమా అని ప్రశ్నించారు. ఇలాంటివి మాకు నచ్చవు అని కొందరన్నారు. వరుణ్ ధావన్ లక్స్ కోజీ దుస్తుల్ని ప్రమోట్ చేస్తున్నట్లు ఉందని కొందరన్నారు. వరుణ్ ధావన్ భార్య నటాషా దలాల్ మీ లొకేషన్ ఎక్కడో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు కొందరు కామెంట్ చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి ఫోటోషూట్ ఏంటని వరుణ్ ను కొందరు ప్రశ్నించారు. ఇక కొందరు అభిమానులు మాత్రం ఆ జంటను డిఫెండ్ చేశారు.