Janhvi Kapoor | కోలీవుడ్లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ .. పా. రంజిత్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం
Janhvi Kapoor | దివంగత అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
Janhvi Kapoor | దివంగత అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మహిళా ప్రధాన కథలు, కంటెంట్ ఆధారిత చిత్రాల్లోనూ నటిస్తూ తన మార్క్‌ను చాటుకుంటోంది.ఇటీవల దక్షిణాది చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జాన్వీ, టాలీవుడ్లో విజయవంతమైన ఆరంభం చేసిన సంగతి తెలిసిందే. ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత ‘పెద్ది’ చిత్రంలో అచ్చియమ్మ పాత్రతో మరోసారి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు కోలీవుడ్లోకి కూడా అడుగుపెట్టనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ రూపొందించనున్న ఓ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌లో నటించేందుకు జాన్వీ కపూర్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే ఇది సినిమా కాకుండా ఓటీటీ కోసం రూపొందించే వెబ్ సిరీస్ అని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు సర్కునం దర్శకత్వం వహించే అవకాశమున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన దుషారా విజయన్ ప్రధాన పాత్రలో రూపొందించిన ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే తరహాలో మరో బలమైన కథతో జాన్వీ కపూర్‌ను ప్రధాన పాత్రలో తీసుకుని కొత్త సిరీస్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
పా. రంజిత్ తన చిత్రాల్లో సామాజిక సమస్యలు, అణగారిన వర్గాల జీవన పోరాటాలు, సమానత్వం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిర్మించే లేదా తెరకెక్కించే ప్రాజెక్టుల్లో మహిళా పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుంది.అలాంటి దర్శకుడి ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్ నటిస్తే, అది ఆమె కెరీర్లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్లామర్‌కు మాత్రమే కాకుండా నటిగా తన ప్రతిభను మరింతగా చాటుకునే అవకాశం ఈ సిరీస్ ద్వారా లభించవచ్చని భావిస్తున్నారు.అయితే, జాన్వీ కపూర్ ఈ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలపై ఇప్పటివరకు చిత్ర బృందం గానీ, జాన్వీ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే, జాన్వీ కపూర్‌కు ఇది కోలీవుడ్‌లో తొలి ప్రాజెక్ట్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

