‘అవతార్’ఫ్రాంచైజీలో మరిన్ని సినిమాలు
‘టర్మినేటర్-2’ ‘టైటానిక్' ‘అవతార్' వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు దర్శకుడు జేమ్స్ కామెరాన్.
‘టర్మినేటర్-2’ ‘టైటానిక్’ ‘అవతార్’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ‘అవతార్’ ఫ్రాంచైజీలో భాగంగా ‘అవతార్-2’ చిత్రం ఈ నెల 16న ప్రపంచవ్యాపంగా భారీ స్థాయిలో విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేమ్స్ కామెరాన్ ‘అవతార్’ ఫ్రాంచైజీ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.
‘అవతార్-3’ 2024లో విడుదలకాబోతున్నదని, నాలుగో భాగం తాలూకు చిత్రీకరణ కొంత పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఐదో పార్ట్ గురించి ఇప్పటికే ప్రకటన వెలువడిందని, తనకు అవకాశమిస్తే అవతార్ 6, 7 భాగాల్ని కూడా తీస్తానని జేమ్స్ కామెరాన్ తెలిపారు. ‘ప్రేక్షకాదరణతో పాటు వ్యాపార సమీకరణాలు ఫ్రాంచైజీలను నిర్ణయిస్తాయి. ‘అవతార్’ఫ్రాంచైజీ చిత్రాలు మరిన్ని వచ్చే అంశాన్ని మార్కెట్ నిర్ణయిస్తుంది’ అని జేమ్స్ కామరూన్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

