Jailer Trailer | సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను హీరో నాగచైతన్య విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రజనీకాంత్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా వుంటుంది. ఆయన స్టయిల్, నటన అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఆసక్తికరమైన కథాంశంతో ఆకట్టుకునే విజువల్స్‌తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ థ్రిల్‌ని అందిస్తూ మెస్మరైజ్ చేసే విధంగా చిత్రం వుంటుంది’ అన్నారు.