Jai Hanuman | టాలీవుడ్ క్రేజీ దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన హనుమాన్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమాని హనుమాన్ సీక్వెల్‌గా చేయాలని అనుకున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌పై కొద్ది కాలంగా వర్క్ చేస్తున్నాడు. మరో వైపు ‘బ్రహ్మరాక్షస్’ కూడా చేస్తున్నాడు. ‘బ్రహ్మ రాక్షస్’ కథ ప్రభాస్ కోసం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జై హనుమాన్ ప్రాజెక్ట్‌ని భారీ రేంజ్లో తెరకెక్కించే ప్లాన్ చేస్తుండగా, ఇందులో ప్రధాన పాత్రకు రిషబ్ శెట్టిని తీసుకొన్నారు.
తాజా సమాచారం ప్రకారం ఇందులో రిషబ్‌తో పాటు చాలా మంది హీరోలు ఉంటారని తెలుస్తుంది. రాముడి పాత్ర కోసం ఓ ప్రముఖ హీరోని సంప్రదిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ఇది సప్త చిరంజీవుల కథ అని తెలుస్తుండగా, పురాణాల ప్రకారం హనుమంతుడు, అశ్వద్ధామ, బలి, కృపుడు, పరశురాముడు… ఇలా ఏడుగురు చిరంజీవులు ఉండేవారు. వారందరిని కూడా జై హనుమాన్ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఇందులో ఒక్కో పాత్రకు ఒక్కో హీరోని తీసుకొంటే ఇక స్క్రీన్ కనుల పండుగగా ఉండడం ఖాయం. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుంది.
హనుమాన్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. జై హనుమాన్ సినిమాలో లీడ్ రోల్ ను జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి పోషిస్తుండగా, రాణా దగ్గుబాటి మరో పాత్రలో నటిస్తున్నారు. ఇక చిరంజీవి హనుమాన్ పాత్రలో కనిపించనున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చిత్రంలో హనుమంతుడు, అశ్వద్ధామ, పరశురాముడు పాత్రల్ని చూపించినట్టు మిగిలిన పాత్రలకు అంత స్కోప్ ఇవ్వకపోవచ్చనే టాక్ ఉంది. ఇందులో ఒక్క హీరో అయితే ఉండడు, కనీసం ముగ్గురు నలుగురు హీరోలు అయిన తప్పక ఉంటారని తెలుస్తుంది. సెప్టెంబరు నుంచి రిషబ్ శెట్టి డేట్లు ఇచ్చినట్టు తెలుస్తుండగా, 2026లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆ తరవాత ప్రభాస్ తో ‘బ్రహ్మరాక్షస్’ పట్టాలెక్కుతుంది.