Chor Bazaar | హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో ఆకాశ్‌పూరి ఒకడు. చైల్డ్ ఆర్టిస్టుగా బుజ్జిగాడు, చిరుత, గబ్బర్‌సింగ్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హీరోగా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేక పోతున్నాడు. ప్రకాష్‌రాజ్ దర్శకత్వం వహించిన ‘ధోని’ చిత్రంలో.. ఆకాష్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆకాష్ హారోగా పరిచయమవుతూ ‘ఆంధ్రాపోరి’ అనే సినిమా తెరకెక్కింది. అస్సలు ఈ సినిమా వచ్చిందనే విషయమే చాలా మందికి తెలియదు. దాంతో మొదటి సినిమానే ఆకాష్‌కు నిరాశను మిగిల్చింది. రెండవ సినిమా కోసం పూరినే స్వయంగా రంగంలోకి దిగి ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కించాడు. కానీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఈ సారి ఎలాగైనా కొడుకుకి ఒక మంచి హిట్ ఇవ్వాలనే తపనతో ఒక బోల్ట్ కంటెంట్‌తో ‘రొమాంటిక్ అనే సినిమాకు నిర్మాతగా వ్వవహరించాడు. పూరి శిశ్యుడు అనిల్ పాడురి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే మేకర్స్ ఈ సినిమాను బోల్డ్ వే లో ప్రజెంట్ చేస్తూ యూత్‌ను ఆకర్షించాడు. భారీ ఆశలతో ఉన్న ఆకాశ్‌కు ఈ చిత్రం కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. బోల్డ్ కంటెంట్, నేహాశెట్టి అందాలు ఈ సినిమాను కాపాడలేకపోయాయి. ప్రస్తుతం ఆకాష్‌పూరి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘చోర్ బజార్’. జీవన్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జడా’ సాంగ్ విడుదలైంది. మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా రామ్ మిరియాల ఆలపించాడు.
విజయ్ దేవరకొండ ‘జడా’ పాటను లాంఛ్ చేశాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో గేహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తుంది. సురేష్ బోబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చాడు. ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపైన మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను ఉస్తాద్ రామ్ విడుదల చేశాడు. ఇక ఈ చిత్రంతో సీనియర్ స్టార్ హీరోయిన్ ఊర్వశి అర్చన తెలుగులోకి రీ-ఎంట్రీ ఇస్తుంది.
Thank you so much@TheDeverakonda Anna for launching #Jadasong !
Really means a lot 🤗🤗 https://t.co/NlCKLRSPX2— Akash Puri (@ActorAkashPuri) March 12, 2022