Jabardasth Anasuya | మెగా హీరోలకు సెంటిమెంట్‌గా అనసూయ.. లక్కీ హ్యాండ్ అంటున్న..
Anasuya bharadwaj | జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారిపోయింది. అందుకే ఆమెకు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.
Anasuya bharadwaj | జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారిపోయింది. మెగా హీరోలతో ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాలనే అందుకున్నాయి. దీంతో అనసూయ భరద్వాజ్ తమ సినిమాల్లో ఉంటే బాగుంటుందని మెగా హీరోలు భావిస్తున్నారు. అందుకే ఆమెకు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో అనసూయ చేసిన పాత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రంగమ్మత్త క్యారెక్టర్లో ఈమె నటించడం కాదు జీవించేసింది. అప్పటి వరకు కేవలం గ్లామర్ డాల్‌గా పేరున్న ఈమెకు.. రంగమ్మత్త అద్భుతమైన గుర్తింపు తీసుకొచ్చింది. అనసూయలో ఎంత మంచి నటి దాగివుందో ఈ సినిమా అందరికీ పరిచయం చేసింది. ఇక వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాలో కూడా చిన్న పాత్రలో మెరిసింది అనసూయ. విన్నర్ సినిమాలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి స్టెప్పులేసింది. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించే అవకాశం కూడా అనసూయకు వచ్చింది. కానీ ఆ సమయంలో గర్భవతిగా ఉండటంతో వచ్చిన అవకాశాన్ని వదులకుంది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాల్లోనూ అనసూయ నటిస్తోంది. తాజాగా మరోసారి ఈమె చిరంజీవితో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించబోతుంది.
చిరంజీవి అంటే నాకు ఎంతో అభిమానం.. ఆయన పేరు చెబితే భక్తి, మర్యాద వాటంతట అవే వస్తాయని ఇటీవల అనసూయ తెలిపింది.రంగస్థలం సినిమా చూసి ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను.. ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది అని చెప్పుకొచ్చింది అనసూయ. దీంతో గాడ్ ఫాదర్లో ఆమెకు ఆఫర్ వచ్చిందని ఫ్యాన్స్ కన్ఫార్మ్ చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలోనూ అనసూయకు అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nivetha Pethuraj | నివేదా పేతురాజ్ లో గొప్ప మార్పు వచ్చిందట..!
అభిషేక్ హాస్పిటల్లో ఉంటే.. ఐశ్వర్యా రాయ్ చూడటానికి రాలేదా..? కారణమేంటి?
మాస్క్ లేకుంటే నగ్నంగా ఉన్నట్టనిపిస్తుంది: మాళవిక మోహనన్
Godfather| చిరంజీవి ‘స్టీఫెన్’ లాగే కనిపిస్తాడా..?
Pushpa: మేకప్ వేసుకోవడానికి రెండు గంటలు, తీయడానికి గంట.. సర్ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

