సినీ లవర్స్ ఫోకస్ అంతా ఇపుడు టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న లూసిఫర్ రీమేక్ పైనే ఉంది. మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ (Godfather) టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఒరిజినల్ వెర్షన్ లో స్టీఫెన్ (క్రిస్ట్రియన్ పాత్ర) కనిపించాడు మోహన్ లాల్.
మరి తెలుగు విషయానికొస్తే చిరంజీవి కూడా ఒరిజినల్ మాదిరిగానే క్రిస్ట్రియన్ రోల్లోనే కనిపిస్తాడా..? లేదంటే కన్వర్టెడ్ హిందువుగా కనిపిస్తాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటివరకు క్రిస్ట్రియన్ పాత్ర పోషించలేదు. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు అంతగా లేకపోవడమే దీనిక్కారణమని పలువురు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో 1.24 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 1.51 శాతం క్రైస్తవ జనాభా ఉన్నట్టు అంచనా. కానీ ఇది కేరళ విషయానికొస్తే ఈ జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది.
కేరళలో క్రైస్తవులు 18 శాతానికిపైనే ఉంటారు. మలయాళ సినిమాల్లో చాలా వరకు క్రిస్టియానిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంటాయి. ఇది కొత్త విషమేమి కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. కానీ కేరళలో క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. లూసిఫర్ లో స్టీఫెన్ రోల్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా..మరి తెలుగులో చిరంజీవిని డైరెక్టర్ మోహన్ రాజా అదే పాత్రలో చూపిస్తాడా..? ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా చూపిస్తాడా..? అని ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు, మూవీ లవర్స్.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!