Pushpa: మేకప్ వేసుకోవడానికి రెండు గంటలు, తీయడానికి గంట.. సర్ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్

సినీ ఇండస్ట్రీలో పాత్రలతో ప్రయోగాలు చేసే వారిలో కమల్ హాసన్, విక్రమ్ ముందు ఉంటారు. వారు ఎంత కష్టాన్నైన ఇష్టంగా చేస్తారు. కమల్ హాసన్ .. భారతీయుడు సినిమాలోని సేనాపతి లుక్ కోసం 4 గంటలు మేకప్ వేసుకునే వాళ్లు. ఇక దశావతారం సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వరూపం వేషధారణకి సంబంధించిన మేకప్ కి ఎక్కువ శ్రమించారు.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడట. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండడంతో ఈ సినిమాలో ఊరమాస్‌గా కనిపించబోతున్నాడు బన్నీ. మోటైన పాత్ర కోసం అద్భుతమైన మేకోవర్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇందులో భయంకరమైన ఎర్రచందనం స్మగ్లర్ గా బన్ని నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన లుక్స్ విడుదల కాగా, అవి ఎంత భయానకంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ ప్రతి రోజు 2 గంటలు మేకప్ వేసుకునే వారట. రింగులజుత్తు, గడ్డం.. షేపులు కోల్పోయిన వీర ముదురు గెటప్ కోసం టాన్ టచ్ అప్ లు చేయించుకుంటున్నాడు బన్ని. అల్లు అర్జున్ మేకప్ వేసుకోవడానికి రోజుకు రెండు గంటలు సమయం తీసుకుంటున్నాడు. మేకప్ ని తొలగించడానికి ఒక గంట సమయం ప్రతిరోజూ కేటాయిస్తున్నారు.ఆయన డెడికేషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. పుష్ప పార్ట్ వన్ క్రిస్మస్ రోజు విడుదల కానున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

