Anasuya look in pushpa | దాక్షాయణి అందరి లాంటి మహిళ కాదు. ఒంటినిండా బంగారునగలు, ముక్కుపుడక, నుదుటన బొట్టు ధరించి సాత్వికంగా కనిపించే ఆమెలో ప్రపంచానికి తెలియని మరో కోణం దాగి ఉంది. అదేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు సుకుమార్.
ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అనసూయ లుక్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. దాక్షాయణిగా సరికొత్త పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్లో తమలపాకు నములుతూ చేతిలోని అడకత్తెరతో పోక చెక్కలను కత్తిరస్తూ పొగరు, రాజసం కలగలసిన కొత్త లుక్‌లో అనసూయ కనిపిస్తున్నది. నెగెటివ్ షేడ్స్‌తో ఆమె పాత్ర శక్తివంతంగా ఉంటుందని సమాచారం. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. తొలి భాగాన్ని డిసెంబర్ 17న విడుదలచేయబోతున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వారికి లీగల్ నోటీసులు పంపిన తమన్నా.. యాంకర్ అనసూయనే కారణమా?
చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరు.. మరోసారి రెచ్చిపోయిన కోట శ్రీనివాసరావు
Jabardasth Anasuya | మెగా హీరోలకు సెంటిమెంట్‌గా అనసూయ.. లక్కీ హ్యాండ్ అంటున్న..
ఆ స్టార్ హీరో తన ప్రతి సినిమాని మొదటి సినిమా అనుకొని శ్రమిస్తారు: అనసూయ