మీరూ సాధించగలరు
సినీ పరిశ్రమలో మహిళలు దర్శకులు అవడం అరుదు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమల్లో వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే మహిళా దర్శకులు ఉన్నారు. వారిలో పేరు తెచ్చుకుని స్థిరపడే వాళ్లు మరీ తక్కువ. ‘గురు’,‘సురారైపోట్రు’ వంటి అర్థవంతమైన చిత్రాలు రూపొందించి మహిళా దర్శకుల్లో స్ఫూర్తి నింపుతున్నారు సుధా కొంగర. సూర్య హీరోగా ఆమె రూపొందించిన ‘సురారైపోట్రు’ చిత్రానికి ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో ఐదు అవార్డులు దక్కాయి.
ప్రస్తుతం ఆమె ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిస్తున్నది. సుధా కొంగర ట్రాక్ రికార్డ్‌తో ఆమెతో సినిమాలు చేసేందుకు పలువురు అగ్ర హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. తను సాధించిన విజయాలే లేడీ డైరెక్టర్స్‌కు స్ఫూర్తి అని చెబుతున్నారు సుధా కొంగర. సుధా కొంగర మాట్లాడుతూ…‘మహిళా దర్శకులు తక్కువ మందే ఉన్నారు. ఇక్కడ కొందరికి త్వరగా అవకాశాలు వస్తాయి.
మరికొందరికి ఆలస్యమవుతాయి. కానీ మన సమయం వచ్చేవరకు ఓపికగా ఉండాలి. ఒక సాధారణ మహిళను నేను. నా చిత్రానికి జాతీయ పురస్కారం దక్కింది. సినీ పరిశ్రమలో ఇదే గొప్ప పురస్కారం. మీరూ నాలాగే సాధించగలరు’ అని చెప్పింది. కథా బలంతో పాటు హీరోయిజం ఉన్న సినిమాలు చేయడం సుధా కొంగర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

