Sudigali sudheer Getting Married | బుల్లితెరపై కామెడీ, వెండితెరపై యాక్షన్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. మెజిషియన్ నుంచి జబర్దస్థ్‌లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్ అనతికాలంలోనే తన కామెడీ టైమింగ్‌తో లీడర్‌గా మారి సుడిగాలి సుధీర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక సినిమాల్లో అడపా దడపా క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న సుధీర్ హీరోగా మారి హిట్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఆయన హీరోగా నటించిన గాలోడు రిలీజై బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ పెళ్లి వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సుధీర్ తోటి కమెడియన్స్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోయారు. కానీ సుధీర్ మాత్రం ఇంకా పెళ్లికి నో చెప్తూనే వస్తున్నాడు. ఇక రష్మితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని ఎన్నో రూమర్స్ వచ్చినా.. అవి కేవలం పుకార్లే అని, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చాలా సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పటికీ వీళ్లకు సంబంధించిన వార్తలు వస్తునే ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టేస్తే.. తాజాగా సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. వాళ్ల చుట్టాలమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.