Salaar Movie | ప్రభాస్ లైనప్‌లో అటు ఫ్యాన్స్‌ను, ఇటు ప్రేక్షకులను తీవ్ర ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న ప్రాజెక్ట్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుంచే అందరిలోనూ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా ‘కేజీఎఫ్-2’ వంటి భారీ హిట్ తర్వాత ప్రశాంత్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభై నెలలు గుడుస్తున్న చిత్రానికి సంబంధించిన అపడేట్లు మాత్రం రావడంలేదు. ఈ విషయంలో మాత్రం డార్లింగ్ అభిమానులు మేకర్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
సలార్ టీజర్‌ను జూన్ 16న రిలీజవుతున్న ‘ఆదిపురుష్’ థియేటర్లలో స్క్రీనింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిత్రబృందం టీజర్‌ను కట్ చేసే పనిలో పడ్డారట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అ మధ్యలో కూడా ప్రభాస్ బర్త్‌డే రోజున టీజర్ అంటూ ఓ అప్డేట్ చక్కర్లు కొట్టింది. అందులో వాస్తవం లేదని చిత్రబృందం అప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. టీజర్‌తో కాస్త విమర్శలు వచ్చిన ట్రైలర్‌తో సినిమాపై మంచి హైపే క్రియేట్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటిస్తుంది. రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఆదిపురుష్ జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.