Rocky aur Rani ki prem kahani | ఆ తెలుగు సినిమాను బేస్ చేసుకుని రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని తెరకెక్కిందా?
Rocky aur Rani ki prem kahani Movie | కరణ్ జోహర్ ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమాతో మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి.
Rocky aur Rani ki prem kahani Movie | కరణ్ జోహర్ ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమాతో మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి. పైగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అయింది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మరో మూడు వారాల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగులో బంపర్ హిట్టయిన ఓ సినిమా కథను బేస్ చేసుకుని తెరకెక్కినట్లు హిందీ మీడియా వర్గాల సమాచారం.
పదిహేడేళ్ల క్రితం తెలుగులో వచ్చిన బొమ్మరిల్లు సినిమా కథను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తుంది. జెనీలియాను ఎందుకు ఇష్టపడుతున్నానో నిరూపించడానికి సిద్ధార్థ్ వారం రోజుల పాటు ఆమెను తమతో పాటు ఇంట్లో ఉండేలా ఫ్యామిలీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. వారం రోజుల తర్వాత ఇంట్లో వాళ్లందరికీ జెనిలియా నచ్చుతుంది. ఆ తర్వాత సిద్దార్థ సెలక్షన్ సరైనదేనని ప్రకాష్ రాజ్ నమ్ముతాడు. ఇక రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని కథ కూడా ఇంచు మించు అలానే ఉంది. వీళ్ల పెళ్లి జరగాలంటే మూడు నెలల పాటు తమ కుటుంబాలను మార్చుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఆలియా ఇంటికి రణ్వీర్ సింగ్, రణ్వీర్ ఇంటికి ఆలియా వెళ్తుంది. మరి చివరికి వీళ్ల పెళ్లిని పెద్దలు అంగీకరించారా అన్న నేపథ్యంలో సినిమా తెరకెక్కింది.
మొత్తం స్టోరీ అచ్చం అలాగే ఉంటుందని చెప్పలేం కానీ మెయిన్ లైన్ అయితే దగ్గరగా కలుస్తోంది. హిందీ పండితులు సైతం ఇది ఆ సినిమా మూల కథను తీసుకున్నారని అంటున్నారు. ఇక బొమ్మరిల్లు చివర్లో జెనీలియా లాగానే సిద్ధార్థ కూడా కోట శ్రీనివాస్ దగ్గర వారం రోజులు ఉంటాడు. ఇదే సినిమాను తమిళంలో జయం రవి చేయగా అక్కడ కూడా బంపర్ హిట్టయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని సిరిసిల్ల నుంచి వేములవాడకు పాదయాత్ర
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

