Ram Charan | ఆర్ఆర్ఆర్ తెచ్చి పెట్టిన క్రేజ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుకోవాలని రామ్‌చరణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇకపై తను చేయబోయే సినిమాలన్ని హై స్టాండడ్స్లో ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శంకర్ వంటి అల్టిమేట్ దర్శకుడుతో గేమ్‌చేంజర్ కోసం చేతులు కలిపాడు. మొదట రెండు, మూడు షెడ్యూల్స్‌ను ఆడుతూ పాడుతూ జరిపిన శంకర్.. ఆ తర్వాత ఇండియన్-2 లైన్లోకి రావడంతో గేమ్ చేంజర్ షూటింగ్‌ను నత్త నడక సాగిస్తున్నాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది లేదంటే ఆపై మరో ఏడాది ఈ సినిమా కోసం వేచి చూడాల్సిందే.
ఓ వైపు గేమ్ చేంజర్ షూటింగ్లో అడపా దడపాగా పాల్గొంటూనే మరోవైపు బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా కోసం ముస్తాబవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ సినిమా ఏ క్షణమైనా సెట్స్ మీదకు వెళ్లొచ్చు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్‌చరణ్ నెక్స్ట్ కమిట్మెంట్కు సంబంధించిన న్యూస్ నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన చరణ్‌ను రాజ్‌కుమార్ హిరానీ కలిసాడని, ఓ కథను కూడా నెరేట్ చేశాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారాలు పుట్టుకొచ్చాయి.
ఇందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. రామ్‌చరణ్‌తో రాజ్ కుమార్ హిరాని సినిమా అంటే అది ఆశా మాశీ కాదు. ఎందుకంటే మాములుగానే రాజ్‌కుమార్ హిరాని ఒక్కో సినిమాకు దాదాపు మూడు, నాలుగేళ్లు టైమ్ తీసుకుంటాడు. తన 20ఏళ్ల సినీ కెరీర్లో ఆయన తీసినవి ఐదు సినిమాలు మాత్రమే. ఇప్పుడు ఆరో సినిమా డంకీ తెరకెక్కతుంది. అలాంటిది చరణ్‌తో సినిమా అంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంది. అంతేకాకుండా ఆ మధ్య రాజ్‌కుమార్ తన తదుపరి సినిమా కోసం అసలు స్క్రిప్టే లేదని వెల్లడించడం గమనార్హం.
ఇన్ని సంశయాల మధ్య రామ్‌చరణ్‌తో సినిమా అంటే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ నిజమే అయితే మట్టుకు ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు నిలవడం ఖాయం. పైగా రాజ్ కుమార్ వంటి గొప్ప దర్శకుడు తొలిసారి సౌత్ హీరో అందులోనూ తెలుగు హీరో అంటూ మనకంటే హ్యాపీగాఎవరు ఉండరు. ఈ రూమర్ నిజమైతే బావుండని ఎంతో మంది నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.