Pushpa-2 Movie Release Date | రెండు జాతీయ అవార్డుల రాకతో పుష్ప సీక్వెల్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. అభిమానులతో పాటు సినీ ప్రేమికులంతా సీక్వెల్ కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లలోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా ఎప్పుడొచ్చిన బంపర్ హిట్టవడం ఖాయం అని అప్పుడే బాక్సాఫీస్ లెక్కలు కూడా వేసేస్తున్నారు. బన్నీ ఈ సారి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్టే సుక్కు సైతం సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక తొలిపార్టు రిలీజైన ఏడాదినర్థం దాటేసింది. కాగా ఇంకా సీక్వెల్‌కు సంబంధించిన రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉన్నారు.
కాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప సీక్వెల్‌కు సంబంధించిన డేట్‌ను చిత్రయూనిట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుని వచ్చే ఏడాది మార్చి 22కు గురి పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నో చర్చల అనంతరం పుష్ప టీమ్ ఈ డేట్‌కు ఫిక్సయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజైన ఫస్ట్ వీకెండ్ తర్వాత మార్చి 25న హోళి వస్తుంది. 29న గుడ్ ఫ్రైడేతో కలిపి మరో పెద్ద వారాంతం కలిసి వస్తుంది. ఇలా సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిన రెండు వారాలు కుమ్మేయడం పక్కా. ఇక సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ గనుక వస్తే మూడో వారం తర్వాత ఉగాది రానుంది. ఈ పండుగను గనుక క్యాష్ చేసుకుంటే భీభత్సాన్ని దాటుకుని వెళ్తుంది. అయితే ఉగాదికి నాలుగు రోజుల ముందు దేవర రిలీజవుతుంది. ఈ సినిమా మాత్రం పుష్పకు కాస్త గట్టి పోటీని ఇచ్చే చాన్స్ ఉంది.
ప్రస్తుతం సీక్వెల్‌కున్న క్రేజ్ చేస్తుంటే రెండు వారాల్లోనే ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అని తెలుస్తుంది. ఇలా మొత్తంగా ఎటు చూసుకున్నా సినిమాకు కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చినా వసూళ్ల ప్రభంజనం ఖాయం. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఇక బెస్ట్ యాక్టర్‌గా బన్నీకు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవికి నేషనల్ అవార్డులు రావడంతో సినిమాపై వీర లెవల్లో అంచనాలు నెలకొన్నాయి.