OG Movie | పవన్ కళ్యాణ్ లైనప్‌లో అందరినీ ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న మూవీ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ప్రీలుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనే ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది. పైగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌ల విషయంలోనే కాదు రిలీజ్ డేట్స్ విషయంలోనూ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో ఓజీ సినిమాను డిసెంబర్ నెలలో తీసుకురావాలని ప్లాన్‌లో ఉన్నాడట. ఇక ఇప్పటికే పవన్ నటిస్తున్న బ్రో సినిమా జూలై చివరి వారంలో రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ పవన్ ఇలా ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వస్తే అభిమానులకు మాత్రం పండగే. ఇక ఓజీ విషయానికొస్తే గ్యాంగ్‌స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ మూడు విభిన్న వేరేయేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట. ఒకటి టీనేజర్ కాగా, రెండు కాలేజీ స్టూడెంట్ రోల్, మూడు డాన్ ఇలా మూడు విభిన్న పాత్రలతో కనిపించనున్నాడని సమాచారం.