ప్రభాస్ ఎదుగుదలను బాలీవుడ్ తట్టుకోలేకపోతుందా.. అందుకే ఇలా..?
Prabhas | ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ లాంటి బయటి హీరో ఒకడు వచ్చి బాలీవుడ్లో జెండా పాతుతుంటే అక్కడ వాళ్లు చూస్తూ కూర్చుంటారని ఎవరు అనుకోరు. పైగా హిందీ ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్‌ను పెద్దగా ఎంకరేజ్ చేయరనే విమర్శ కూడా ఉంది. అందుకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి స్టార్ హీరో కూడా బ్యాక్‌గ్రౌండ్ లేక ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది అంటారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఎదుగుదలను బాలీవుడ్ అస్సలు తట్టుకోలేకపోతోందని ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండు సినిమాలతో బాలీవుడ్ హీరోల రికార్డులను కూడా యంగ్ రెబల్ స్టార్ తుడిచి పెట్టేశాడు.
బాహుబలి 2 బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దాదాపు 1000 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో కూడా 160 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక సౌత్ హీరో బాలీవుడ్లో ఇంత సంచలనం సృష్టించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. పైగా సాహో తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం సంచలన విజయం సాధించింది. ఉత్తరాది ప్రేక్షకులకు ప్రభాస్ అంతగా చేరువయ్యాడు. అయితే తాజాగా విడుదలైన రాధే శ్యామ్ సినిమా విషయంలో మాత్రం జరగడం లేదు. మొన్న మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు దారుణమైన నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు బాలీవుడ్ క్రిటిక్స్. సాహో సినిమాకు వాళ్లు బాగానే సహకారం అందించారు.. కానీ రాధే శ్యామ్ మాత్రం అత్యంత దారుణంగా ఉంది అంటూ చీల్చి చెండాడారు. అంతేకాదు స్క్రీన్ మీద ప్రభాస్ చాలా బద్దకంగా కనిపించాడు అంటూ విమర్శలు కూడా చేశారు.
అంతటితో ఆగకుండా రాధే శ్యామ్ విషయంలో పర్సనల్ టార్గెట్ కు దిగారు బాలీవుడ్ విశ్లేషకులు. ప్రభాస్ చూడటానికి బాగోలేడని.. లవ్ స్టోరీ అతడికి సూట్ కాదు అంటూ విమర్శించారు. అంతేకాదు ప్రభాస్ వయస్సు గురించి కూడా రివ్యూలలో ప్రస్తావించారు. ప్రభాస్ తల్లిగా నటించిన భాగ్యశ్రీ ఏజ్‌తో హీరో వయసు పోలుస్తూ తక్కువ చేసి మాట్లాడారు. మరికొందరు రివ్యూ రైటర్స్ కూడా ప్రభాస్ గురించి పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ విమర్శించారు. ఇదంతా చూస్తుంటే ఒక బయటి హీరో బాలీవుడ్‌కు వస్తే వాళ్లు ఓర్చుకోలేరు అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే మరి ఏంటి.. సల్మాన్, షారుక్, అమీర్ ఖాన్ ఏమైనా కుర్రాళ్లా.. వాళ్ళ కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు అమ్మలుగా నటించడం లేదా.. అలాంటప్పుడు ప్రభాస్ వయస్సు గురించి ఎందుకు మాట్లాడాలి అంటూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- Prabhas
- radhe shyam
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

