Bhola Shankar Movie | సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘ఖైదీనెంబర్ 150’ తర్వాత చిరుకు ఆ రేంజ్ హిట్ మొన్నటి వరకు లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘సైరా’ పక్క రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. తెలుగులో పర్వాలేదనిపించే కలెక్షన్లతో లాక్కొచ్చింది. ఇక ‘ఆచార్య’ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. కనీసం సినిమా బడ్జెట్లో పావు వంతు కలెక్షన్లు కూడా రికవరి చేయలేకపోయింది. దసరా కానుకగా విడుదలైన ‘గాడ్‌ఫాదర్’ కూడా అంతే. తొలి రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా అప్పటికే ఎంతో మంది చూసేసిన ‘లూసీఫర్’కు రీమేక్‌గా రావడంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచలేదు. దాంతో ఈ సినిమా కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ముఖ్యంగా ఆచార్య, గాడ్‌ఫాదర్ ఫలితాలతో చిరు మార్కెట్ చాలా వరకు దెబ్బతింది.
ఇక చిరు కంబ్యాక్ ఇవ్వలేడు. ప్రేక్షకులకు చిరు బోరైపోయాడు. ఇకపై సినిమాలు తీసినా ఇదే పరిస్థితి ఎదురవుతుందంటూ ఎన్నో విమర్శలను చిరు ఎదుర్కొన్నాడు. కట్ చేస్తే వాల్తేరు వీరయ్యతో విమర్శలు చేసిన నోటీతోనే ప్రశంసలు దక్కించుకున్నాడు. వింటేజ్ బాస్ అంటూ ఈలలు వేయించుకున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తొలిరోజు పెద్దగా పాజిటీవ్ టాక్ ఏమి తెచ్చుకోలేదు. కానీ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ఇదే కాస్త బెటర్‌గా ఉండటంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ వాల్తేరు వీరయ్యను చూడడానికి థియేటర్లకు ఎగబడ్డారు.
ఐతే ఈ ఒక్క సినిమాతో చిరు సత్తాను అంచనా వేయలేం. చిరు రేంజ్ ఏంటో తెలియాలంటే ‘భోళా శంకర్’ సినిమానే సరైంది. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి బజ్ లేదు. పైగా చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇవన్నీ పక్కన పెడితో ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలను ప్రేక్షకులను గాలికి వదిలేస్తున్నారు. అందులోనూ అసలు తెలుగులో హిట్టేలేని మెహర్‌రమేష్ ఈ సినిమా బాధ్యతలు తీసుకోవడంతో మెగా అభిమానులు సైతం భోళాశంకర్‌పై ఇంట్రెస్ట్ చూపడంలేదు. మరి ‘వాల్తేరు వీరయ్య’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన చిరు అదే ఊపుతో భోళా శంకర్‌తో తన స్టైల్ కామెడీ, చరీష్మాతో ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్‌ను బట్టి చిరు రేంజ్ ఏంటో, సినిమాను ఎంతవరకు లాక్కెల్లగలడో తెలుస్తుంది.