నాకు సంతృప్తిని, రెస్పెక్ట్‌ని ఇచ్చిన సినిమా ‘ఇరుముడి’
‘చెప్పలేనంత ఆనందాన్నిచ్చిన సినిమా ‘ఇరుముడి’. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా సంతృప్తిని, రెస్పెక్ట్‌ని ఇచ్చిన సినిమా ‘ఇరుముడి’. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు శివ నిర్వాణదే. తనో పని రాక్షసుడు.. పర్ఫెక్షనిస్ట్. నటుడిగా నాకు ఇంతటి సంతృప్తినిచ్చిన సినిమా మరొకటి లేదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ’ అని అగ్ర కథానాయకుడు రవితేజ అన్నారు.
‘చెప్పలేనంత ఆనందాన్నిచ్చిన సినిమా ‘ఇరుముడి’. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా సంతృప్తిని, రెస్పెక్ట్‌ని ఇచ్చిన సినిమా ‘ఇరుముడి’. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు శివ నిర్వాణదే. తనో పని రాక్షసుడు.. పర్ఫెక్షనిస్ట్. నటుడిగా నాకు ఇంతటి సంతృప్తినిచ్చిన సినిమా మరొకటి లేదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ’ అని అగ్ర కథానాయకుడు రవితేజ అన్నారు.
ఆయన కథానాయకుడిగా నటించిన డివోషనల్ థ్రిల్లర్ ‘ఇరుముడి’. ప్రియ భవాని శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రధారులు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై వై.రవిశంకర్, నవీన్ యర్నేని నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో రవితేజ మాట్లాడారు. చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘ఇది ప్రేక్షకుడి విజయం. భరించలేనంత ఆనందాన్నిచ్చిన సినిమా ‘ఇరుముడి’.
ఇరవై రోజులుగా పరిశ్రమ నుంచి చాలామంది శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి అభినందించారు. వారందరితో మాట్లాడించడానికే ఈ వేడుక. నిజాయితీగా పనిచేస్తే దేవుడే మంచి విజయం ఇస్తాడు. దానికి ఉదాహరణే ‘ఇరుముడి’. ఇక నుంచి కూడా ఇంతే నిజాయితీగా పనిచేస్తా’ అని ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందంతోపాటు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు సానా, టీజీ విశ్వప్రసాద్, సాహు గారపాటి, కోన వెంకట్, బీవీఎస్ రవి, చిత్ర పంపిణీదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

