Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
Movies | సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సీజన్ అంటేనే బాక్సాఫీస్ సందడి గుర్తుకొస్తుంది. అగ్ర హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకులకు పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈసారి ఆ సందడి సంక్రాంతికి రెండు నెలల ముందుగానే మొదలుకానుంది.
Movies | సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సీజన్ అంటేనే బాక్సాఫీస్ సందడి గుర్తుకొస్తుంది. అగ్ర హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకులకు పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈసారి ఆ సందడి సంక్రాంతికి రెండు నెలల ముందుగానే మొదలుకానుంది. ఎప్పుడూ పెద్దగా పోటీ ఉండదనే పేరున్న నవంబర్ నెల ఈసారి భారీ చిత్రాలతో కళకళలాడబోతోంది. దీపావళి నుంచి నెలాఖరు వరకు ప్రతి వారం కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా, డిసెంబర్, సంక్రాంతి విడుదల తేదీలు ఇప్పటికే చాలా వరకు ఖరారవడంతో పలువురు నిర్మాతలు నవంబర్‌ను తమ సినిమాల విడుదలకు ఎంచుకుంటున్నారు. పాన్ ఇండియా చిత్రాల నుంచి చిన్న, మధ్య తరహా సినిమాల వరకు వరుసగా థియేటర్లలోకి వస్తుండటంతో ఈ నెల బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారనుంది.
నవంబర్ ఆరంభంలోనే పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘రామాయణం: పార్ట్ 1’ నవంబర్ 5న విడుదలకు సిద్ధమైంది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ వంటి ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సూర్య నటించి, నిర్మించిన ‘సీన్’, నయనతార, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాశక్తి’ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే రోజున తెలుగు నుంచి ‘సమ్మర్ హాలిడేస్’ కూడా విడుదల కానుంది. దీంతో నెల మొదటి వారంలోనే థియేటర్ల వద్ద సందడి మొదలవనుంది. నవంబర్ రెండో వారం కూడా బాక్సాఫీస్ వద్ద మరింత రద్దీగా ఉండనుంది. నవంబర్ 12, 13 తేదీల్లో శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోగి’, సుడిగాలి సుధీర్ నటించిన ‘గోట్’ విడుదల కానున్నాయి.
వీటితో పాటు అక్కినేని నాగార్జున సమర్పణలో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ‘ఇట్లు అర్జున’, ‘చంద్రయాన్’, ‘మాయలేడి’, ‘అ’ వంటి చిన్న, మధ్య తరహా చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకే వారంలో ఇన్ని సినిమాలు విడుదల కానుండటంతో ప్రేక్షకుల ఆదరణ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.నవంబర్ మూడో వారం కూడా స్టార్ నటీనటుల సినిమాలతో సందడిగా మారనుంది. తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కలయికలో వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19న విడుదల కానుంది. యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఇది కొనసాగింపుగా రూపొందుతోంది. మరుసటి రోజు నవంబర్ 20న పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన బహుభాషా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదల కానుంది. అదే రోజున ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల, మమ్ముట్టి తదితరులు నటించిన ‘ఓం’, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోర్టు రూమ్ డ్రామా ‘సత్యవాన్ సావిత్రి’ కూడా థియేటర్లలోకి రానున్నాయి.
నవంబర్ చివరి వారంలోనూ రిలీజుల జోరు తగ్గేలా కనిపించడం లేదు. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘మైసా’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆమె గిరిజన యువతిగా సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. అదే తేదీన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, సంయుక్త నటించిన ‘హైందవ’, ఎస్. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘హై’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా నవంబర్ నెలలో ప్రతి వారం కొత్త సినిమాల సందడి కనిపించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

