Rashmika Mandanna | వారిని గర్వపడేలా చేస్తా!
కన్నడంలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న చిత్రంతో కెరీర్‌ను ఆరంభించిన కన్నడ సొగసరి రష్మిక మందన్న అనతికాలంలోనే తారాపథంలో దూసుకుపోయింది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్‌పరంగా తాను ఎన్నో విజయాలు సాధించినా తల్లిదండ్రులు మాత్రం తన గురించి ఏ మాత్రం గర్వపడటం లేదని చెప్పింది రష్మిక మందన్న.
కన్నడంలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న చిత్రంతో కెరీర్‌ను ఆరంభించిన కన్నడ సొగసరి రష్మిక మందన్న అనతికాలంలోనే తారాపథంలో దూసుకుపోయింది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్‌పరంగా తాను ఎన్నో విజయాలు సాధించినా తల్లిదండ్రులు మాత్రం తన గురించి ఏ మాత్రం గర్వపడటం లేదని చెప్పింది రష్మిక మందన్న. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘మా కుటుంబానికి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. అమ్మనాన్న కూడా సినిమాల గురించి అంతగా పట్టించుకోరు.
ఇండస్ట్రీ మీద వారికి పెద్దగా అవగాహన లేదు కాబట్టి నా విజయాల్ని చూసి ఏమాత్రం పొంగిపోరు. అయితే ఏదైనా అవార్డు వచ్చిందని చెబితే సంతోషపడతారు. పాఠశాల రోజుల్లో మా కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. వ్యాపారాల్లో నష్టం వచ్చి నాన్న బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. అందుకే నా తల్లిదండ్రులు గర్వించేలా మరిన్ని విజయాలు సాధించాలనుకుంటున్నా. కెరీర్లో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

