వైశాలిగా మెప్పిస్తా
‘గాడ్సే’ చిత్రంలో వైశాలి పాత్రలో ఆకట్టుకుంటా అని చెబుతున్నది నాయిక ఐశ్వర్య లక్ష్మి. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోపి గణేష్ రూపొందిస్తున్నారు. సి కళ్యాణ్ నిర్మాత. ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారీ తార. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ…‘సమాజాన్ని ప్రశ్నించే ఓ వ్యక్తి కథ ఇది. ఇందులో నేను వైశాలి అనే పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాను. కండబలంతో పాటు బుద్ధి బలాన్ని ఉపయోగించే అధికారిగా కనిపిస్తాను. ఆమె బాధ్యత గల అధికారి మాత్రమే కాదు బాధ్యత గల పౌరురాలు కూడా. ఈ కథ నాకు బాగా నచ్చింది. భాష తెలియకున్నా సన్నివేశాల భావోద్వేగాలను అర్థం చేసుకునేదాన్ని. సహాయ దర్శకుల హెల్ప్‌తో సంభాషణలు ఇంగ్లీష్‌లో రాయించుకుని నేర్చుకున్నాను. దర్శకుడు గోపి గణేష్ అంత సమయాన్ని ఇవ్వడం వల్లే పాత్రలో సరిగ్గా నటించగలిగాను. సత్యదేవ్ మంచి నటుడు. అతను నటించిన చిత్రాలు చూశాను. తోటి నటుడిగా సహకరించాడు. తెలుగు, తమిళ, మలయాళం భాషలేవైనా నాకు సినిమా అంటే ఇష్టం. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో నటిస్తున్నాను. అప్పట్లో విజయశాంతిలా యాక్షన్ ఫిలింస్ చేసి పేరు తెచ్చుకోవాలని ఉంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Godse Movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

