Surrogacy Celebrities | సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయిన సెలబ్రెటీలు వీళ్లే
Surrogacy Celebrities | కోలీవుడ్ స్టార్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ తాజాగా ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ గత సాయంత్రం సోషల్‌మీడియాలో ప్రకటించిగా.. ఆ వార్త క్షణాల్లోనే వైరల్ అయింది. వీరిద్ధరికి పెళ్ళై నాలుగు నెలలు మాత్రమే అయింది.
Surrogacy Celebrities | నయనతార, విఘ్నేశ్ శివన్ జంట సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పెళ్లయి ఐదు నెలలు కూడా కాకుండానే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనివ్వడమేంటి? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అయితే ఏకంగా.. సరోగసీ చట్టబద్ధంగానే జరిగిందా? లేదా? అన్నదానిపై వివరణ ఇవ్వాలని కోరింది. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా ఈ విషయం వైరల్ అయిన నేపథ్యంలో గతంలో సరోగసీ ద్వారా పేరెంట్స్ అయిన సెలబ్రెటీలు ఎవరని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
నిజానికి సరోగసీని ఎంచుకుని చాలామంది సెలబ్రెటీలు తల్లిదండ్రులుగా మారారు. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మంచి లక్ష్మి ముందుస్థానంలో ఉంది. ఈమె సరోగసీ ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది. బాలీవుడ్లో అయితే ఈ లిస్ట్ పెద్దగానే ఉంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్‌రావు జంట కూడా 2011లో సరోగసీ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. కిరణ్ రావు గర్భాశయ సమస్యలతో బాధపడుతుండటంతో వీరు సరోగసీని ఎంచుకున్నారు. షారుఖ్ ఖాన్, గౌరీఖాన్ జంట కూడా 2013లో సరోగసీ ద్వారా మూడో సంతానాన్ని పొందింది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా జంటకు కూడా సరోగసీ ద్వారానే రెండో సంతానాన్ని పొందారు. 2016లో తుషార్ కపూర్ సరోగసీ ద్వారా బిడ్డను పొందాడు. ఆ తర్వాత ఏక్తాకపూర్ కూడా అదే పద్ధతిని అనుసరించింది. 2019లో ఏక్తాకపూర్కు మగబిడ్డ జన్మించాడు. సోహెల్ ఖాన్, సీమా జంట కూడా మొదటి సంతానం కలిగిన పదేళ్లకు సరోగసీని ఆశ్రయించింది.
సింగిల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నందున బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా 2017లో సరోగసీ ద్వారానే కవల పిల్లలను పొందాడు. 2018లో లిసా, జాసన్ డెహ్నీలు అద్దె గర్భం ద్వారా కవల పిల్లలను పొందారు. క్యాన్సర్ బారిన పడి మందులు వాడుతున్నందున లిసా సరోగసీని ఆశ్రయించింది. 2018లోనే సన్నీలియోని సరోగసీ ద్వారా కవలపిల్లలకు తల్లి అయ్యింది. 2019లో శ్రేయాస్ తల్పాడే, దీప్తి సరోగసీ ద్వారా ఆడ బిడ్డను పొందారు. తమకు పెళ్లయి 14 ఏళ్లు అయినా పిల్లలు లేకపోవడంతో అద్దె గర్భాన్ని ఆశ్రయించారు. 2021లో ప్రీతిజింటా, జీస్ గూడెనఫ్ జంట సరోగసీ ద్వారా కవలపిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. తనకు రెండుసార్లు గర్భస్రావం కావడంతో అద్దె గర్భం ద్వారా ఆమె తల్లిగా మారానని ప్రీతిజింటా అప్పట్లో వివరణ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోసస్ దంపతులు కూడా బిడ్డ కోసం సరోగసినే ఎంచుకున్నారు.
ఏదేమైనా చాలామంది మహిళలు అనారోగ్య సమస్యల కారణంగా సరోగసీ విధానంతో మాతృత్వ మధురిమలు పొందుతున్నారు. కానీ పెళ్లయి ఐదు నెలలు కూడా కాకముందే నయనతార జంట అద్దె గర్భాన్ని ఆశ్రయించి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అందుకే నయన్ , విఘ్నేశ్ జంటను ఇప్పుడు అందరూ తప్పుపడుతున్నారు.
Read Also:
NBK107 | ఆ రెండు పవర్ఫుల్ టైటిల్స్‌ను.. బాలకృష్ణ సినిమాకు అనుకుంటున్నారా?
Chennakeshava Reddy | రీ-రిలీజ్ కలెక్షన్లతో ‘జల్సా’ రికార్డు బ్రేక్ చేసిన బాలకృష్ణ.. కానీ?
సరోగసిపై నటి కస్తూరి కామెంట్లు.. మండిపడుతున్న నయన్ అభిమానులు
Oke Oka Jeevitham | ఓటీటీలోకి వచ్చేస్తున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

