కమల్ హాసన్ (kamal haasan), శంకర్ (Shankar ) కాంబినేషన్ అంటే బాక్సాపీస్ వద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు మరోసారి ఇండియన్ 2 (Indian 2) సినిమాతో ట్రెండ్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కాగా షూటింగ్ మొదలై మధ్యలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చాయి.
తాజా టాక్ ప్రకారం ఇండియన్ 2 షూటింగ్ సెప్టెంబర్ 13న తిరిగి షురూ కానుంది. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఎంపికైన కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal) ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో పాల్గొన్నది. ఈ సెషన్లో ఇండియన్ 2 షూటింగ్ రీస్టార్ట్ పై లీక్ ఇచ్చేసింది. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఇండియన్ 2 . లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో (ప్రెగ్నెన్సీ, బాబు పుట్టిన తర్వాత) మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతుందన్నమాట. శంకర్ ప్రస్తుతం ఆర్సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-కమల్ కాంబోలో వచ్చిన భారతీయుడు బాక్సాపీస్ ను షేక్ చేయడమే కాదు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్‌గా వస్తున్న ఇండియన్ 2పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి.