సినిమా జర్నలిస్టులకు కష్టకాలం.. వేధిస్తున్న వరుస మరణాలు
రెండు నెలల వ్యవధిలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ముగ్గురు చనిపోయారు. వాళ్ల మరణాలు కూడా ఊహించనివి. అప్పటి వరకు బాగుండి.. ఉన్నట్లుండి హఠాన్మరణం పాలయ్యారు. వాళ్లే బీఏ రాజు, టీఎన్ఆర్, కత్తి మహేశ్. తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరణం అందరికీ షాక్ ఇస్తుంది.

రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇండస్ట్రీలోని ప్రముఖులు మరణిస్తున్నారు.. సినిమా వార్తలు రాసే జర్నలిస్టులు కూడా మరణిస్తున్నారు. ఇదే ఇప్పుడు అందరిలోనూ విషాదం నింపుతుంది. కేవలం రెండు నెలల వ్యవధిలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ముగ్గురు చనిపోయారు. వాళ్ల మరణాలు కూడా ఊహించనివి. అప్పటి వరకు బాగుండి.. ఉన్నట్లుండి హఠాన్మరణం పాలయ్యారు. వాళ్లే బీఏ రాజు, టీఎన్ఆర్, కత్తి మహేశ్. తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరణం అందరికీ షాక్ ఇస్తుంది. ముఖ్యంగా ఆయన్ని అభిమానించే వాళ్లు కత్తి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయనెలాంటి వాడు.. ఎన్ని విమర్శలు చేశాడు అనేది మరణించిన తర్వాత మరిచిపోతున్నారు. అయ్యో పాపం కత్తి మహేశ్ చనిపోయాడా అంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 26న జరిగిన యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేశ్.. చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ మరణించారు. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన హృదయ కాలేయం సినిమాలో పోలీస్ పాత్రలో నటించి నవ్వించిన కత్తి.. ఆ తర్వాత దాదాపు 10 సినిమాల్లో నటించాడు. మొన్న రవితేజ క్రాక్ సినిమాలోనూ కనిపించాడు.

కత్తి మహేశ్ కంటే ముందు బీఏ రాజు మరణం కూడా ఇలాగే అందరికీ షాక్ ఇచ్చింది.1300 సినిమాలకు పైగా పని చేసిన బీఏ రాజు సీనియర్ మోస్ట్ పీఆర్ఓ. ఈయన మే 23న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇక మే 10న సీనియర్ జర్నలిస్ట్ టీఎన్ఆర్ కూడా మరణించాడు. ఈయన కరోనాతో కన్నుమూశాడు. యూ ట్యూబ్‌లో సంచలన ఇంటర్వ్యూలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. ప్రముఖ సినీ జర్నలిస్టుగానే కాకుండా నటుడిగానూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే కరోనా టీఎన్ఆర్ను కాటేసింది. కేవలం 60 రోజుల వ్యవధిలోనే టీఎన్ఆర్.. బీఏ రాజు.. కత్తి మహేశ్ లాంటి సినీ ప్రముఖులు కన్నుమూశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Kathi Mahesh | సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
కడవరకు కాంట్రవర్సీలతోనే కాపురం చేసిన కత్తి మహేష్
ప్రమాదమే లేదన్నారు కదా.. మరి కత్తి మహేశ్ మరణానికి కారణమేంటి?
ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే థియేటర్లు ఎందుకు.. డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

