Vanda Devullu | తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ ఆంటోని. బిచ్చగాడు తర్వాత డైరెక్టర్ శశి డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ‘వంద దేవుళ్లు’. ఈ మూవీని జూన్ 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఈవెంట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. శశి 20 ఏళ్ల నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం నాకు బిచ్చగాడు సినిమాతో హీరోగా కొత్త లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వంద దేవుళ్లు సినిమాతో రాబోతున్నామన్నారు. శశి ఈ సినిమా కథ చెప్పిన తర్వాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుంది. జూన్ 19న వస్తోన్న వంద దేవుళ్లు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నానన్నాడు.
డైరెక్టర్ శశి మాట్లాడుతూ.. బిచ్చగాడు సినిమాతో పదేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాను. ప్రేక్షకులకు అప్పుడు మా గురించి ఏమి తెలియకపోయినా పెద్ద హిట్ చేశారు. ఆ క్షణం నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగు ప్రేక్షకులను నేనెప్పటికీ మరిచిపోను. ఇప్పుడు మళ్లీ విజయ్ ఆంటోనీతోనే తల్లీకొడుకుల కథతో మీ ముందుకు రాబోతున్నా. అమ్మను దేవతలా చూస్తే ‘బిచ్చగాడు’.. అమ్మని సాధారణ మనిషిలా చూస్తే ‘వంద దేవుళ్లు’ అని చెప్పుకొచ్చాడు.
విజయ్ ఆంటోని చేసే ప్రతీ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. ఆయన డైరెక్టర్, హీరో, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎన్ని ఉన్నా అన్నింటికంటే కూడా ఆయన ఒక మంచి వ్యక్తి అని నటి, నిర్మాత నిహారిక కొణిదెల అన్నది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. వినోదంతోపాటు ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చింది.
వంద దేవుళ్ళు దర్శకుడిగా మీకు హామీ ఇస్తున్నాను ఈ చిత్రంకూడా 100 % బిచ్చగాడు లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది
– Director #Sasi at #VandaDevullu PreRelease Event#VandaDevulluFromJune19
A #FamilyBiopic#VijayAntony#VandaDevulluPreReleaseEvent@vijayantony #Sasi pic.twitter.com/tIAIOgGUQQ— Sai Satish (@PROSaiSatish) June 15, 2026