‘పుష్ప’ ఓ లెవల్ అయితే.. ‘పుష్ప 2’ నెక్ట్స్ లెవల్..’ ఈ మాట అన్నది ఎవరోకాదు. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్. చెన్నయ్‌లో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు. ‘పుష్ప-2’ గురించి అక్కడి మీడియా మిత్రులతో కొన్ని విషయాలు పంచుకున్నారు దేవిశ్రీ. ఇంకా మాట్లాడుతూ-“ ‘పుష్ప-2’ గురించి విడుదలకు మందు మాట్లాడటం సబబు కాదు. ఏమీ అనుకోవద్దు.
కానీ ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీక్వెన్స్ చూశాను. మైండ్ బ్లోయింగ్. మాటల్లో చెప్పలేను. దాన్ని తెరపై చూస్తేనే కరెక్ట్.ఇందులో కొత్త అల్లు అర్జున్ను చూస్తారు. సుకుమార్ పర్ఫెక్షన్ను ఇష్టపడతారు. రాజీ పడటం అంటే అతనికి చిరాకు. సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో ‘పుష్ప-2’ ఉండబోతున్నది. ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. ‘పుష్ప’ నన్ను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలబెట్టింది. ‘పుష్ప-2’ ఇంకా బెటర్‌గా ఉండాలని నావంతు కృషి చేస్తున్నా” అన్నారు దేవిశ్రీప్రసాద్.