Lavanya Tripathi | ‘సతీ లీలావతి’లో డైరెక్టర్‌గా కనిపిస్తా.. ఆ సినిమాతో పోల్చొద్దు : లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi | లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం సతీలీలావతి (Sathi Leelavathi). తాతినేని సత్య దర్శకత్వం ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 8న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది లావణ్య త్రిపాఠి.
Lavanya Tripathi | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఈ బ్యూటీ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం సతీలీలావతి (Sathi Leelavathi). భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి) సినిమాలను తెరకెక్కించిన తాతినేని సత్య దర్శకత్వం ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 8న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది లావణ్య త్రిపాఠి.
సతీ లీలావతి సినిమాను ఇప్పటికే చూశా. చాలా బాగుంది. సినిమాపై నాకు చాలా నమ్మకముంది. ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్నిస్తారో చూడాలంది లావణ్య త్రిపాఠి. సినిమా షూటింగ్ టైంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే. కానీ మా టీం ఇచ్చిన సపోర్ట్‌తో సులభంగా షూటింగ్ పూర్తి చేశాను. ప్రతీ రోజూ షూటింగ్ పూర్తయ్యాక ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్ని. షూట్లో చిన్న చిన్న గాయాలవడం సాధారణంగా జరిగేదే కదా. ఈ కథ విన్నప్పుడు వరుణ్‌కు చెప్పాను. అప్పుడు ప్రెగ్నెంట్ అని నాకు తెలియదు. ఎలాంటి లక్షణాలు కూడా లేవు. షూటింగ్ కూడా అంత సులభమేం కాదని నాకు అర్థమైంది. ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గాను. కానీ నాకు ఈ శక్తి ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. ఇక నుంచి ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్స్‌కు బ్రేక్ ఇస్తానంటూ చెప్పుకొచ్చింది.
సతీలీలావతిలో తాను డైరెక్టర్ రోల్లో కనిపిస్తానని.. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుందని చెప్పింది లావణ్య త్రిపాఠి. సతీ లీలావతిలో చూపించినట్టుగా రిలేషన్స్ బయటిప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి ఏ మహిళకు రాకూడదు. నేను ప్రెగ్నెంట్ కదా అని మూవీ స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ యాక్షణ్ సీక్వెన్స్‌లో మార్పులు చేశారు. తొలిసారి నేను యాక్షన్ సీక్వెన్స్ చేశాను. సినిమాలో కాలితో కొట్టే సీన్ ఒకటి చేసినప్పుడు ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చింది.
ఇందులో సీనియర్ యాక్టర్ నరేశ్, వీటీవీ గణేశ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఈమూవీని కమల్ హాసన్ సతీ లీలావతితో పోల్చలేం కానీ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అదొక క్లాసికల్ మూవీ. దాంతో ఈ సినిమాను పోల్చకూడదంది. సతీలీలావతి చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగమోహన్ బాబు ఎం, రాజేష్ టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also :
Salman Khan | సల్మాన్ ఖాన్ సరసన ఫహాద్ ఫాజిల్? ‘SVC63’ విలన్ వేటలో వంశీ పైడిపల్లి!
Asthma | ఆస్తమా సమస్య ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం ఈ యోగాసనాలు
CP Sumathi | అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సుమతిని వేధించిన 40 మంది పోకిరీలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

