Rag Mayur | సినిమా బండి మూవీలో మరిడేజ్ బాబు పాత్రలో నటించి ఎంట్రీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాగ్ మయూర్. 2021లో విడుదలైన సినిమా బండి మే 15తో సక్సెస్‌ఫుల్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది. తనకు మంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల, నిర్మాతలు రాజ్-డీకేకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఈ సందర్భంగా చేసిన చిట్‌చాట్‌లో రాగ్ మయూర్ మాట్లాడుతూ.. నటుడిగా కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే నాకు మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం అదృష్టంగా భావిస్తున్నా. అంతకంటే మంచి డెబ్యూను కోరుకోలేనని.. సినిమా బండి తనకు యాక్టర్‌గా మంచి గుర్తింపు తీసుకొచ్చిందన్నాడు.
పాపులర్ హిందీ వెబ్ సిరీస్ ‘ పంచాయత్ ’ రీమేక్‌గా వచ్చిన ‘ సివరాపల్లి ’ లో రాగ్ మయూర్ కనబరిచిన యాక్టింగ్.. తను లీడ్ రోల్లో సినిమాను మొదటి నుంచి చివరి వరకు హ్యాండిల్ చేయగలడని నిరూపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత వీరాంజనేయులు విహార యాత్ర, కీడాకోలా, గాంధీతాతా చెట్టు సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలతో యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యాడు రాగ్ మయూర్.
గతేడాది సమంత తెరకెక్కించిన శుభం సినిమాలో గెస్ట్ రోల్లో కూడా మెరిశాడు. అది చిన్న కామియో రోల్ అయినా ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందన్న రాగ్ మయూర్ ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సమంతకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన మిత్రమండలిలో రాగ్ మయూర్ చెప్పిన ఇంగ్లీష్ వన్ లైనర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ గౌరి నాయుడు తెరకెక్కిస్తున్న గరివిడి లక్ష్మిచిత్రంలో బుర్రకథ కళాకారుడిగా కనిపించబోతున్నాడు రాగ్‌మయూర్.
Rashmika | ‘మైసా’ కోసం రష్మిక కష్టాలు .. కాళ్లకు టేప్ వేసుకొని మరి..!
CM Vijay | త్వరలో మహిళలకు నెలకు రూ.1,000.. వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్