Aishwarya Lekshmi Interview | దుల్కర్ సల్మాన్ లవర్‌గా నటించా.. కింగ్ ఆఫ్ కొత్త హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ
Aishwarya Lekshmi Interview | కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) తాజాగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పాన్ ఇండియా ప్రాజెక్ట్ కింగ్ ఆఫ్ కొత్త (King Of Kotha) లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసింది ఐశ్వర్య లక్ష్మి. కింగ్ ఆఫ్ కొత్త విశేషాలు ఐశ్వర్య లక్ష్మి మాటల్లోనే..
Aishwarya Lekshmi Interview | మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ప్రాంఛైజీలో సముద్రకుమారిగా అందరినీ మెప్పించింది కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). ఈ బ్యూటీ తాజాగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పాన్ ఇండియా ప్రాజెక్ట్ కింగ్ ఆఫ్ కొత్త (King Of Kotha) లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసింది ఐశ్వర్య లక్ష్మి. కింగ్ ఆఫ్ కొత్త విశేషాలు ఐశ్వర్య లక్ష్మి మాటల్లోనే..
కింగ్ ఆఫ్ కొత్తలో మీ పాత్ర గురించి ఏమైనా చెప్పగలరా..?
ఈ సినిమా ఫిక్షనల్ టౌన్ సెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌లో దుల్కర్ సల్మాన్ పాత్ర చుట్టూ సాగుతుంది. ఇందులో అతడి ప్రేయసి తార పాత్రలో నటించా. నా స్క్రీన్ టైం చాలా క్లీన్‌గా ఉంటుంది. తార ప్రజెంటేషన్ సినిమా కథనంపై ప్రభావం చూపించేలా ఉంటుంది. ఒకవేళ తార పాత్రను తీసేస్తే.. సినిమా అసంపూర్తిగా ఉన్నట్టే. నా పాత్ర మాత్రమే కాకుండా.. సినిమా తాజా ఫీల్‌తో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌తో మిమ్మల్ని ఇంప్రెస్ చేసేలా ఉండబోతుంది.
దుల్కర్ సల్మాన్‌తో పనిచేయడం ఎలా ఉంది..?
దుల్కర్ సల్మాన్ ఒక అసాధారణ కోస్టార్. నిర్మాత అయినప్పటికీ సెట్స్‌లో ప్రతీ ఒక్కరితో కలిసిపోతూ అవిశ్రాంతంగా పనిచేస్తుంటారు. దుల్కర్ మనస్తత్వం, ఆయన స్వభావం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. దుల్కర్ సల్మాన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నా ఆలోచలను అతనితో పంచుకుంటా. నా కొత్త ప్రాజెక్టుల గురించి చర్చిస్తుంటాను.
డెబ్యూ డైరెక్టర్ అభిలాష్ జోషితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి..
అభిలాష్ జోషి సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపై అద్భుతమైన పట్టును కలిగి ఉన్నాడు. అతను నటీనటుల నుంచి ఆశిస్తున్న అవుట్‌ఫుట్‌ను రాబట్టేందుకు కావాల్సిన పూర్తి వివరణలు అందిస్తారు. అభిలాష్ దార్శనికత, విస్తారమైన దృక్పథం అసాధారణమైనవి. కింగ్ ఆఫ్ కొత్త విడుదలతో ఆయన క్రేజ్ పెరుగుతోంది. సెట్లో అభిలాష్ ప్రవర్తన ఆయన తండ్రి జోషి (పాపులర్ డైరెక్టర్)తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. డైరెక్టర్ జోషితో నాకు మంచి అనుబంధం ఉంది.
గాడ్సే తర్వాత తెలుగు సినిమా చేయడం లేదు..?
నేనెప్పుడూ తెలుగు చిత్రాలు చేయడంపై, వైవిధ్యమైన పాత్రలను స్వీకరించడానికి ఆసక్తిగా ఉంటా. ఊ అంటావా మావా పాటలో సమంత పాత్ర లాంటి బోల్డ్ లుక్ లేదా మహానటిలో కీర్తి సురేష్ లాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఛాలెంజింగ్ పాత్రలు చేయడాన్ని ఇష్టపడతా.
మీ అభిమాన సహనటి ఎవరు..?
దసరాలో కీర్తిసురేశ్ యాక్టింగ్ చాలా అసాధారణంగా ఉంటుంది. నా ఫేవరేట్ నటీమణుల్లో సమంత కూడా ఉంటుంది. కోపం, భావోద్వేగ పూరిత సన్నివేశాల్లో సమంత తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తుంది. శ్రీలీల అద్బుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. సాయిపల్లవి డ్యాన్సర్‌గా, నటిగా అసాధారణ రీతిలో తనను తాను నిరూపించుకుంది. ఫిదాలో సాయిపల్లవి పాత్రకు ఫిదా అయిపోయా.
మీ ఫ్యూచర్ ప్రాజెక్టులపై..
తమిళ సినిమా లైన్లో ఉంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా. కొత్త సినిమాలకు సైన్ చేసిన తర్వాత అందరితో షేర్ చేసుకుంటా.
కింగ్ ఆఫ్ కొత్త ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

