Sushanth Interview | రావణాసురలో కొత్తగా కనిపించే ఛాన్స్ దొరికింది.. సుశాంత్ చిట్‌చాట్
రవితేజ (Ravi Teja) నటిస్తోన్న క్రైం థ్రిల్లర్ రావణాసుర (Ravanasura). ఈ చిత్రంలో సుశాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా సుశాంత్ (Sushanth) మీడియాతో చిట్ చాట్ చేశాడు. రావణాసుర విశేషాలు అందరితో పంచుకున్నాడు.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న క్రైం థ్రిల్లర్ రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రవితేజ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా సుశాంత్ (Sushanth) మీడియాతో చిట్ చాట్ చేశాడు. రావణాసుర విశేషాలు అందరితో పంచుకున్నాడు.
రావణాసుర కథ విన్నప్పుడు మీ రియాక్షన్..?
నిర్మాత అభిషేక్ నామా నాకు రావణాసుర ఆఫర్ చేసినప్పుడు నేను మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నా. ఆ పాత్రలో నన్ను తీసుకోవాలని అనుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. రావణాసుర స్క్రిప్ట్ విన్న వెంటనే ఇది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అనిపించింది. ఇందులో నా పాత్ర చాలా కీలకంగా సాగుతుంది. రవితేజ కొత్త పాత్రలో కనిపిస్తాడు.
రావణాసుర మీరా..? రవితేజనా..?
నా ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్‌గా సుశాంత్ అనే క్యాప్షన్‌తో విడుదలైంది. రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. మీరు ట్రైలర్‌ను గమనిస్తే దాదాపు అన్నీ పాత్రలు గ్రే షేడ్స్‌లో కనిపిస్తాయి. అంతేకాదు హీరోలు ఉనికిలో లేరనే ట్యాగ్ లైన్ కూడా టైటిల్లో ఉంటుంది. ఇంతకీ ఎవరు రామ్, ఎవరు రావణాసుర అనేది సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
తొలిసారి పూర్తి స్థాయి థ్రిల్లర్ సినిమాకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది..?
నా గత సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’లో కొన్ని ఉత్కంఠభరితమైన సీన్లున్నప్పటికీ.. అది పూర్తి స్థాయి థ్రిల్లర్ కాదు. రావణాసుర నా మొదటి పూర్తి స్థాయి థ్రిల్లర్ ప్రాజెక్ట్. ఇది అనేక కొత్త అంశాలతో సాగే ఉత్తేజకరమైన థ్రిల్లర్. టాలీవుడ్లో మునుపెన్నడూ చూడని విధంగా వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంచాలా ఫ్రెష్‌గా ఉంటుంది.వైవిధ్యభరితమైన పాత్రలను పోషించాలని చూస్తున్న నాకు ఈ చిత్రంలో కొత్తగా కనిపించే అవకాశం వచ్చింది.
రవితేజ, మీ కాంబినేషన్ సీన్లు ఎలా వచ్చాయి?
బిగ్ స్క్రీన్‌పై మా సీన్లను చూస్తున్నప్పుడు అభిమానులు భిన్నమైన అనుభూతిని పొందుతారు. కథనంలో మా సన్నివేశాలు చాలా కీలకంగా సాగుతాయి. సుధీర్ వర్మ నన్ను, రవితేజను చాలా కొత్తగా చూపించారు. సినిమా సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడొస్తుంది..అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
అల వైకుంఠపురంలో మీ కెరీర్లో కొత్త ట్విస్ట్ ఇచ్చిందా..?
అల వైకుంఠపురంలో సక్సెస్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రత్యేకించి ఉత్తరాదిన మంచి పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత పలు ఆఫర్లు వచ్చాయి.. కానీ ఎక్జయిటింగ్‌గా అనిపించిన స్క్రిప్ట్‌లనే ఎంపిక చేసుకుంటున్నా. రావణాసుర, మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ కథలు నాకు చాలా ఎక్జయిటింగ్‌గా అనిపించాయి.
టాలీవుడ్లో 15 ఏళ్లు పూర్తయ్యాయి.. కానీ మీరు మీ స్క్రిప్ట్‌ల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉన్నారు..?
అక్కినేని కుటుంబం నుంచి సినిమా రంగంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నా. మొదటి నుంచి నాకు వచ్చిన సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నా. అయితే కొన్ని సినిమాలు షూటింగ్ సమయంలో ఆలస్యమైతే.. కొన్ని విడుదల చాలా ఆలస్యం అయ్యాయి. చి ల సౌ తర్వాత నా సినిమాల్లో గ్యాప్ లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత కోవిడ్ రావడంతో మరింత గ్యాప్ వచ్చింది. కానీ నేను గత 6 నెలలుగా చాలా బిజీగా ఉన్నా. సోలో హీరోగా స్క్రిప్ట్‌ని ఓకే చేశా. ప్రస్తుతం మరికొన్ని స్క్రిప్ట్‌లు కూడా వింటున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

