బిగ్‌బాస్ 16తో పాపులారిటీ సంపాదించుకున్న నటి నిమృత్ కౌర్ అహ్లూవాలియా. ‘చోటి సర్దార్ని’ టీవీ షోతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు బిగ్‌బాస్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా సందడి చేసింది. నటిగా ఎదగాలంటే అంత తేలిక కాదని, దానికి ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని చెబుతున్నది నిమృత్ కౌర్.
ఒక సమయంలో తాను చాలా డిప్రెషన్‌కు గురయ్యానని, దాన్నుంచి బయటపడేందుకు ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది. ‘టీవీ సీరియల్ షూటింగ్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. దాంతో ఆందోళనకు గురవుతుండేదాన్ని. ఒకానొక దశలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా. దాన్నుంచి బయటపడటానికి 40 రోజులు విరామం తీసుకున్నాను. ప్రస్తుతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది ఈ యంగ్ బ్యూటీ.